ఉరవకొండ:'ఇప్పటికైనా వారి డిమాండ్లను పరిష్కరించండి'

దిల్లీలో జెఎన్‌యూ విద్యార్థి సంఘం చేస్తున్న నిరాహార దీక్షకు మద్దతుగా ఉరవకొండ శుక్రవారం ఏఐఎస్ఏ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నియోజకవర్గ కన్వీనర్ భీమేష్ మాట్లాడుతూ జెఎన్‌యూ ఎస్‌యూ విద్యార్థి హక్కుల కోసం నిరంతరం పోరాడుతోందని, అధ్యక్షుడు నితీష్ నేతృత్వంలో 13 రోజుల దీక్ష కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీ అధికారులు తక్షణమే డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్, ఎర్రి స్వామి, వంశీ, సాగర్, నవీన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్