గురువారం ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణంలో విద్యార్థులకు డివిజనల్ స్థాయి క్రీడా పోటీలు జరిగాయి. అండర్-14, 17 విభాగాల్లో షటిల్, బ్యాడ్మింటన్, బో-ఖో, యోగా పోటీలు నిర్వహించారు. విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ లెవల్ కోఆర్డినేటర్ నాగరాజు, ఎంఈఓలు ఈశ్వరయ్య, రమాదేవి, హెచ్ఎం సత్యనారాయణ, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.