మొంథా తుపాను ప్రభావంతో కురిసిన వర్షాల వల్ల తేమ పెరిగి పప్పుశనగ పంటకు పచ్చపురుగు ఆశించింది. మండలంలో 15 రోజులు ముందుగానే పంట సాగు చేశారు. తగ్గుపర్తి, బెళుగుప్ప, దుద్దేకుంట, గంగవరం, ఎర్రగుడి, వెంకటాద్రిపల్లి గ్రామాల్లో అధికంగా సాగు చేశారు. మండల వ్యాప్తంగా 9300 ఎకరాల్లో సాగు చేసిన ఈ పంటకు వేరుకుళ్లు తెగులు కూడా సోకి మొక్కలు చనిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైతులు శనివారం ఈ వివరాలు తెలిపారు.