కరువుతో అల్లాడుతున్న రైతులకు కళింగర పంట కాసుల వర్షం కురిపిస్తోందని, బెళుగుప్ప మండల గుండ్లపల్లికి చెందిన రైతు రమేశ్ గురువారం విలేఖరులకు తెలిపారు. మూడు ఎకరాలలో ఈ పంట సాగు చేశానని బాహు బలి-2 రకం విత్తనాన్ని కిలో రూ. 28వేలు ప్రకారం ఒకటిన్నర కిలోలు కొనుగోలు చేశానన్నారు. ప్రస్తుతం మూడు ఎకరాల్లో మొదటి సారి పంట తొలగించగా 45 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. టన్ను రూ. 12 వేలతో విక్రయించానన్నారు.