ఉరవకొండ: సర్పంచు చేస్తే రూ. 30లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తా

సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే, విడపనకల్లు గ్రామంలో ఏకగ్రీవ ఎన్నిక కోరుతూ వైసీపీ మద్దతుదారు మల్లికార్జున శుక్రవారం దండోరా వేయించారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ. 30 లక్షలు ఇస్తానని ఆయన ప్రకటించారు. ఈ దండోరా వీడియో వైరల్ అవడంతో పోలీసులు అప్రమత్తమై, అనుమతి లేకుండా దండోరాలు వేయిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్