విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామానికి వెళ్లే దారిలో ఉన్న కాజ్వేను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. విషయాన్ని టీడీపీ నాయకులు మంత్రి పయ్యావుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి వెంటనే మరమ్మతులకు అధికారులను ఆదేశించారు. సర్పంచ్ కొత్తపల్లి పద్మావతి ఆధ్వర్యంలో ఆదివారం పనులు పూర్తి చేయించారు.