ఉరవకొండ: ఊపిరి పీల్చుకున్న అధికారులు గేటు మరమ్మతులకు నిధులు

కూడేరు మండలంలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) కుడి కాలువ గేట్లను సోమవారం పైకి లేపి, నీటిని విడుదల చేశారు. గతంలో గేట్లను తెరవడానికి ప్రయత్నించినప్పుడు రెండు గేట్లు పైకి లేవలేదు. సోమవారం రెండు బృందాలు కలిసి పనిచేసి, గేట్లను కొంతవరకు పైకి లేపగలిగాయి. దీంతో కాలువకు 500 క్యూసెక్కుల నీరు విడుదల అవుతోంది. ఈ పరిణామంతో నీటిపారుదల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్