ఉరవకొండ: ఇసుక వాహనాలు సీజ్

బెళుగుప్ప మండలంలోని కాలువపల్లి వద్ద పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. ఉన్నత పాఠశాల సమీపంలో ఈ ఇసుక ట్రాక్టర్లు ఇటీవల వేగంగా వెళుతూ అదుపుతప్పి ప్రహరీని ఢీ కొనడంతో అది ధ్వంసమైంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనిపై పాఠశాల ఉపాధ్యాయులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ శివ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్