భారత నాణ్యతా మండలి దేశంలోని సర్పంచులను ఒకే వేదికపైకి తెచ్చేందుకు సర్పంచ్ సంవాద్ పేరిట మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది. అందులో కూడేరు మండలం పి. నారాయణపురం సర్పంచు హనుమంతరెడ్డి జాతీయ స్థాయిలో ఘనత సాధించారు. గ్రామాభివృద్ధి భవిష్యత్తు ఆలోచనలపై నిర్వహించిన పోటీలకు తాను పంపిన వీడియోకు జాతీయ స్థాయిలో తనకు రెండో స్థానం దక్కినట్లు సర్పంచు హనుమంతరెడ్డి శుక్రవారం తెలిపారు.