ఉరవకొండ: భూమిపై రైతులకు హక్కు కల్పించడమే ధ్యేయం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, బెళుగుప్ప మండలంలోని గుండ్లపల్లిలో శుక్రవారం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణతో కలిసి ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా 544 మంది రైతులకు నూతన పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. భూమిపై రైతులకు యాజమాన్య హక్కు కల్పించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని, గతంలో వారసత్వ ఆస్తులకు జగన్ బొమ్మ వేసుకుని పంపిణీ చేయడం వల్ల రైతుల్లో నెలకొన్న అభద్రతా భావాన్ని తమ ప్రభుత్వం తొలగించిందని మంత్రి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్