ఉరవకొండ నియోజకవర్గ కేంద్రంలోని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి కార్యాలయంలో వరుసగా రెండవరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం, ఉరవకొండ నియోజకవర్గం, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ రకాల సమస్యలపై మంత్రి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.