కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేనంతగా హంద్రీనీవా ప్రాజెక్టుకు రూ. 3, 440 కోట్లు కేటాయించినట్లు అధికారులు వివరించారు. వేగంగా కాలువ విస్తరణ పనులు చేపట్టి దాదాపు పూర్తి చేసిందని గురువారం వారు వివరించార. ఈ నెల 15న హంద్రీనీవాకు నీరు విడుదల చేయనున్న నేపథ్యంలో మాల్యాల నుంచి 3, 850 క్యూసెక్కుల నీటిని తీసుకునేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. విడతల వారీగా 10పంపుల నుంచి నీటిని ఎత్తిపోసి జీడిపల్లికి తరలించేలా ప్రణాళికలు రూపొందించారు.