తమకు 200యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వినియోగానికి అవకాశం ఉండగా అధికారులు బిల్లులు పంపారని విడపనకల్లు ఎస్సీ కాలనీ వాసులు వాపోయారు. బిల్లులు చెల్లించని వారి విద్యుత్తు కనెక్షన్లను తొలగించారని సోమవారం జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. విద్యుత్తు అధికారులకు వ్యతిరేకంగా నినదించారు. ఎస్ఐ ఖాజాహుస్సేన్ వారికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.