కర్నూలు జిల్లా మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో స్నానానికి దిగిన ఉరవకొండకు చెందిన సంధ్య (22) ప్రమాదవశాత్తూ గల్లంతై మృతి చెందింది. సత్యనారాయణ స్వామి వ్రతం కోసం కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన ఆమె నదిలో మునిగిపోవడంతో, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు గాలించి మృతదేహాన్ని వెలికితీశాయి. మృతదేహాన్ని స్వగ్రామం ఉరవకొండకు తరలిస్తున్నారు.