మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమతూకంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సోమవారం ఉరవకొండలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ప్రాజెక్టులు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిపై సీఎం దృష్టి సారించారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో విఫలమైందని, కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని అన్నారు. గ్రామ గ్రామాన ప్రజల సమస్యలను తెలుసుకొని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.