పురాతన బసవేశ్వర ఆలయ కలశం చోరీ (VIDEO)

AP: అనంతపురం జిల్లా డి.హీరేహాళ్ మండలం కుడ్లూరు గ్రామంలోని పురాతన బసవేశ్వర ఆలయంలో కలశం చోరీకి గురైంది. సోమవారం అర్ధరాత్రి వేళ గ్రామస్తుల ఆరోపణల ప్రకారం, దుండగులు విద్యుత్ సరఫరాను నిలిపివేసి ప్రణాళికాబద్ధంగా ఈ దొంగతనానికి పాల్పడ్డారు. 2025 జూలైలో కూడా ఇక్కడ చోరీ జరిగిందని, అప్పట్లో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది గుప్తనిధుల ముఠాల పని అని వారు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు తక్షణమే విచారణ జరిపి, చోరీకి గురైన కలశాన్ని రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕