ఆంధ్రా పేపర్ మిల్లుకు రూ.21.01 కోట్ల జరిమానా.. కారణమిదే

AP: రాజమండ్రిలోని ఆంధ్రా పేపర్ మిల్లుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.21.01 కోట్ల భారీ జరిమానా విధించింది. గోదావరి నది పరిసరాల్లో వ్యర్థాలను విడుదల చేస్తూ, PCB నిబంధనలను ఉల్లంఘిస్తోందని ఈ చర్య తీసుకుంది. 2016 నుంచి ఈ సంస్థ స్థానిక సంస్థలకు రూ.21.34 కోట్ల వరకు పన్ను చెల్లించలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ట్వీట్ చేశారు. వెంటనే సమన్లు జారీ చేసి, చర్యలు తీసుకోవాలనే ఆదేశాల మేరకు మిల్లుకు జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్

✕
✕