ఏపీకి మరోసారి వాన గండం

ఏపీకి మరోసారి వాన గండం పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడి శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా - ఆంధ్ర తీరాలను గోపాల్‌పూర్, పారాదీప్ మధ్య దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు, దక్షిణ కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయ్. తీరం వెంబడి గంటకు 40 - 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్