AP: సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ సూపర్ లీగ్‌లో గ్రూప్-ఏలో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఆంధ్ర ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 206 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆంధ్ర జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19.5 ఓవర్లలో ఛేదించింది. మర్మరెడ్డి హేమంత్ రెడ్డి 53 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లతో 109 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో నితీశ్ కుమార్ బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమయ్యాడు.