విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల ఆందోళన (వీడియో)

విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో జీతాల పెంపుపై ఇచ్చిన హామీని కూటమి మోసం చేసిందని వారు ఆరోపించారు. విజయవాడలో అరెస్టు చేసిన అంగన్వాడీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల వేతనాలు పెంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ నిరసన అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్