AP: YCPలో చాలామంది నేతలు మంత్రి పదవులు దక్కించుకుని ఆర్థికంగా బలోపేతమయ్యారు. అయితే, పార్టీ కష్టకాలంలో ఉండగా చాలామంది నేతలు పార్టీని వీడారు లేదా సైలెంట్ అయ్యారు. కొడాలి నాని వంటివారు ఇటీవల యాక్టివ్ అవుతున్నా, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం కనిపించడం లేదు. ఆయన కోఆర్డినేటర్ల సమావేశానికి కూడా హాజరు కాలేదు. నెల్లూరులో అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కనిపించే ఆయన ఇప్పుడు పూర్తిగా మాయమయ్యారు. ఆయన మళ్ళీ యాక్టివ్ అవుతారా లేక రాజకీయాలకు దూరమవుతారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.