AP: రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద మూడో విడత నిధులను విడుదల చేసింది. PM-KISAN కింద కేంద్రం ఇచ్చిన ₹2,000తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ₹4,000 జమ చేయడంతో ఒక్కో రైతు ఖాతాలో మొత్తం ₹6,000 చేరాయి. అయితే అర్హత ఉండి డబ్బులు జమ కాకపోతే అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌లో ఆధార్ నంబర్‌తో స్టేటస్ చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. సమస్య ఉంటే రైతు సేవా కేంద్రం, గ్రామ/వార్డు సచివాలయంలో సంప్రదించవచ్చు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 155251కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.