AP: సూపర్ సిక్స్ హామీలలో కీలకమైన ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం అమలుకు రాష్ట్రం ప్రభుత్వం సన్నద్ధమైంది. ఆగస్టు 2న ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌలు రైతుల విషయంలో మొదటి, రెండో విడత మొత్తాలను కలిపి రూ.14,000ను రెండో విడతలో ఒకేసారి జమ చేయనున్నట్లు సమాచారం. కౌలు రైతులకు కార్డుల పంపిణీ పూర్తైన అనంతరం ఈ నిధులను వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి.