ఏపీ రైతులకు ప్రభుత్వం దసరా కానుక అందించనుంది. పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ పథకాల రెండో విడత నిధులను అక్టోబర్ 17న అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం. ఒక్కో రైతుకు రూ.6 వేల చొప్పున అందించనున్నారు. కాగా, తొలి విడతలో 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్ల నిధులు విడుదలయ్యాయి.