వైఎస్సార్ కడప జిల్లా, బద్వేల్ మండలం టెకూరుపేటలో అంగన్వాడీ ఉత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బద్వేల్ AMC చైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోరుమామిళ్ల అంగన్వాడీ సూపర్వైజర్ మాధవి అధ్యక్షత వహించగా CDPO లక్ష్మి సహకరించారు. ఈ సందర్భంగా టెకూరుపేట సెక్టార్ పరిధిలోని 35 మంది అంగన్వాడీ టీచర్లను పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర సన్మానించారు. అదనంగా టెకూరుపేట అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల అవసరాల కోసం నాగేంద్ర రూ. 5,000 ఆర్థిక సహాయం అందించారు.