పోరుమామిళ్ల మండలం టెకూరుపేటలో అంగన్వాడీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ AMC చైర్పర్సన్ నారిశెట్టి సుప్రజ హాజరయ్యారు. కార్యక్రమం పోరుమామిళ్ల అంగన్వాడీ సూపర్వైజర్ మాధవి అధ్యక్షతన CDPO లక్ష్మి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించారు. ఈ సందర్భంగా టెకూరుపేట సెక్టార్ పరిధిలోని సుమారు 35 మంది అంగన్వాడీ టీచర్లను పోరుమామిళ్ల బీజేపీ అధ్యక్షుడు నాగేంద్ర ఘనంగా సన్మానించారు. అలాగే టెకూరుపేట అంగన్వాడీ కేంద్రంలోని చిన్నారుల అవసరాల కోసం రూ. 5, 000 ఆర్థిక సహాయాన్ని నాగేంద్ర అందించారు.