కాశినాయన మండలంలోని సావిశెట్టిపల్లెలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. వైద్య అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని శనివారం గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జ్వరం వస్తే కాళ్ల నొప్పులు, ముఖం నల్లబడుతున్నాయని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పలువురు గ్రామస్థులు వైద్యం కోసం ప్రైవేట్ హాస్పిటళ్లకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నివారణా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.