వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో విద్యా కమిటీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడు కమిటీలను శనివారం ఏకగ్రీవంగా గెలుచుకుంది. పోరుమామిళ్ల మండలంలోని పులివీడు పంచాయతీ పరిధిలో జరిగిన ఈ ఎన్నికల్లో చిన్న పులివీడు, బొప్పాపురం, పేరమ్మగారిపల్లె విద్యా కమిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన ప్రతినిధులు పోరుమామిళ్లలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గోవింద్ రెడ్డిని కలిశారు.