వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్లో, పోరుమామిళ్ల తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె మంగళవారం ప్రారంభమైంది. గ్రామ రెవెన్యూ సహాయకులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, ఇతర న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని వీఆర్ఏలు కోరుతున్నారు.