నార్జంపల్లెలో ఘనంగా మొహర్రం సందడి

మైలవరం మండలం నార్జంపల్లెలో మొహర్రం పండుగ ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుగుతున్నాయి. శనివారం పెద్దగుండం ప్రవేశం నేపథ్యంలో భక్తులు చావిడిలోని పీర్లవద్ద ఫాతిహాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో హిందూ, ముస్లిం సోదరులు కలిసి పాల్గొని మత సామరస్యాన్ని చాటుతున్నారు. ఆదివారం పీర్లను గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి, సంప్రదాయం ప్రకారం ఏటిలో సాగనంపడంతో మొహర్రం ఉత్సవాలు ముగియనున్నాయి.

సంబంధిత పోస్ట్