వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం అట్లూరు మండలంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐ మధుసూదన్ గౌడ్ సోమవారం బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలో శాంతిభద్రతలు, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై ఇరువురు పరస్పరం చర్చించినట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్‌ఐకి మంచూరు సూర్యనారాయణరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.