నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం రామాపురంలో పల్లె పండుగ 3.0లో భాగంగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనుల కోసం రూ.11,085 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ సందర్భంగా బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఆదేశాల మేరకు నియోజకవర్గం నుంచి 6,000 మందిని తరలించేందుకు జన సమీకరణ చేపట్టారు.