అగ్నిప్రమాదంలో గడ్డివాము దగ్ధమైన ఘటన ముద్దనూరు మండలం ఉప్పలూరులో ఆదివారం మూడు గంటలకు జరిగింది. ఉప్పలూరుకి చెందిన అట్లా బ్రహ్మం రెడ్డి పశువుల కోసం తన కలంలో గడ్డివామును నిల్వ చేసుకున్నాడు. జ్యోతుల సందర్భంగా బాణా సంచాలు కాల్చుతుండగా గాలికి నిప్పురవ్వలు గడ్డివాముపై పడ్డాయి. దీంతో ఒక్కసారిగా మంటలంటుకున్నాయి. ఫైర్ స్టేషన్ కి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.