వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

ఎర్రగుంట్ల మండలంలోని సున్నపురాళ్లపల్లెకు చెందిన బుక్కే వెంకటేశ్ నాయక్ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు కలమల్ల ఎస్సై తిమోతి తెలిపారు. ఎర్రగుoట్ల ఆర్టీపీపీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్న వెంకటేశ్ గత నెల 31వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. ఈ మేరకు అతని తల్లి బుక్కే రతిదేవి గురువారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

సంబంధిత పోస్ట్