కడప ఉక్కు పరిశ్రమపై మరో శంకుస్థాపన వద్దు..ఆర్‌ఎస్‌ఎఫ్

వైఎస్సార్‌ కడప జిల్లా, జమ్మలమడుగులో కడప ఉక్కు పరిశ్రమ పేరుతో వరుస శంకుస్థాపనలు చేసి రాయలసీమ ప్రజలను మోసం చేస్తున్నారని ఆర్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు డి. యం. ఓబులేసు యాదవ్ బుధవారం ఆరోపించారు. విభజన చట్టం ప్రకారం సెయిల్ ఆధ్వర్యంలోనే ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మహానాడులో ఇచ్చిన హామీకి ఏడాది పూర్తైనా పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. మరోసారి శంకుస్థాపన చేస్తే సీఎం చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్