కడప నగరంలో మంగళవారం రాత్రి బిల్డప్ సర్కిల్ వద్ద దారుణ హత్య చోటు చేసుకున్నది. స్థానికుల సమాచారం మేరకు మృతుడు కడప నగరంలోని రవీంద్ర నగర్ లో నివాసం ఉంటున్న సాధక్ గా గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు మృతుడిని హత్య చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.