ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లాకు చేరుకున్నారు. శుక్రవారం ఒంటిమిట్ట కళ్యాణ మహోత్సవాల్లో పాల్గొనేందుకు గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానం ద్వారా కడప విమానాశ్రయంకు చేరుకున్నారు. ఉమ్మడి జిల్లా అధికారులు, పార్టీ నాయకులు ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ఆయన ఒంటిమిట్టకు బయలుదేరారు.