కడప- అనంతపురం హైవేపై కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. లారీ కిందకు కారు వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి.. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు అనంతపురం ఇస్కాన్ టెంపుల్‌కు చెందిన భక్తులుగా గుర్తించారు. యాక్సిడెంట్ జరగడంతో అనంతపురం-కడప హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.