అమరావతి మహిళలపై సజ్జల వ్యాఖ్యలు ఖండిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మంగళవారం ప్రకటించారు. చేసిన తప్పునకు క్షమాపణ చెప్పడానికి ఇబ్బందేంటని ఆమె ప్రశ్నించారు. మహిళలు తన అక్కాచెల్లెళ్లు అని జగన్ అంటారని, కానీ, ఆయన సొంత చెల్లికే మర్యాద ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో ఇతర మహిళలకు ఏం గౌరవం ఇస్తారని ఘాటుగా స్పందించారు. చేసిన తప్పులే వైసీపీ నాయకులు మళ్లీ మళ్లీ చేస్తున్నారని ఆమె అన్నారు.