కడప రిమ్స్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో రోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై సీపీఎం నేతలు శుక్రవారం డాక్టర్ శ్రీవల్లితో చర్చించారు. ఈ సందర్భంగా నగర కార్యదర్శి రామ్మోహన్ రోగులకు వైద్యం ఆలస్యం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమర్జెన్సీ నుంచి క్యాజువాల్టీకి రోగులను తరలించే సమయంలో ఎదురయ్యే సమస్యలను వివరించారు. అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉన్నాయని, ఇబ్బందులు లేవని డాక్టర్ వివరించారు.