కడప: తల్లి మందలించిందని ఉరేసుకుని కుమార్తె మృతి

తల్లి మందలించడంతో కుమార్తె ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప చిన్నచౌకు పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన బాలిక(14) తండ్రి ఏడాది కిందట మృతి చెందారు. పిల్లల పోషణభారం తల్లి చూసుకుంటోంది. ఈ నేపథ్యంలో బాలిక మొబైల్ ఫోన్ లో ఎక్కువ సమయం గడుపుతోందని తల్లి మందలించింది. మనస్తాపానికి గురైన బాలిక మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సంబంధిత పోస్ట్