ఎంత పని సేచ్చి వయ్యా జగనూ అంటూ కడప నగరంలో ఆర్ట్స్ కళాశాల వద్ద ఫ్లెక్సీ కలకలం లేపింది. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై ఫ్లెక్సీ గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం జగన్ బాటలోనే నడవాల్సిన పరిస్థితి నెలకొన్నది అని ఫ్లెక్సీలో రాశారు. 11 సీట్లు వచ్చినా కూడా నీ పరిపాలనే కొనసాగు తుందయ్యా అంటూ ఫ్లెక్సీలో అజ్ఞాత వ్యక్తులు పేర్కొన్నారు.