వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు డా.చైతన్యరెడ్డిపై కేసు నమోదు అయింది. అలాగే పలువురు పోలీసు అధికారులపైనా కేసు రిజిస్టర్ అయినట్లు సమాచారం. వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు జైల్లో చైతన్య తమను కలిసి మభ్యపెట్టినట్లు గతంలో దస్తగిరి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.