కడప మండలం కృష్ణాపురం-కడప రైల్వేస్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి సోమవారం సాయంత్రం రైలు కింద పడి మృతి చెందాడని కడప రైల్వే ఎస్సై సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మృతుడికి సుమారు 70 సంవత్సరాల వయస్సు ఉంటాయని చెప్పారు. ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు.