కడప: మహనీయుని ఆశయాలతో స్ఫూర్తిగా విధులు నిర్వహించాలి

మహనీయుని ఆశయాలను స్ఫూర్తిగా చేసుకుని విధుల్లో పునరంకితమవుదాం అని కడప జిల్లా ఎస్. పి అశోక్ కుమార్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్‌ బీఆర్‌. అంబేద్కర్‌ జయంతి వేడుకలు సోమవారం కడప జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు. జిల్లా ఎస్. పి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశానికి అంబేద్కర్ గారు చేసిన సేవలను కొనియాడారు.

సంబంధిత పోస్ట్