రాష్ట్ర వ్యాప్తంగా శనివారం విడుదలైన ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలలో కడప జిల్లా కమలాపురంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన విద్యార్థినిలు అందరూ ఫెయిల్ అయ్యారు. కళాశాలలో 33 మంది పరీక్షకు హాజరుకాగా ఒకరు కూడా పాస్ కాలేదు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 14 మంది పరీక్షకు హాజరై ఇద్దరు మాత్రం పాస్ అయ్యారు.