కడప నగరంలోని కొండాయిపల్లి ఆరో వార్డులో మాజీ కార్పొరేటర్ నాగేంద్ర ఆధ్వర్యంలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమం కొండాయిపల్లి ప్రాథమిక పాఠశాల నందు ప్రారంభమైంది. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ, 5 సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం అందరి బాధ్యత అని, 'ఒక్క చుక్క. రెండు చుక్కలు.. పోలియోకి చెల్లు చుక్కలు' అనే నినాదంతో పోలియో రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వైద్య సిబ్బంది పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. వందలాది మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చుక్కలు వేయించారు.