దేశవ్యాప్తంగా జరుగుతున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా, మంగళవారం కడపలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో హాండ్స్ 4 యు సంస్థ ఆధ్వర్యంలో ఎస్ఎ రైటింగ్ ప్రతిభా అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు బాలకృష్ణ యాదవ్, బిజెపి ఎస్సీ మోర్చా కడప జిల్లా అధ్యక్షులు వెంకట రమణ మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం కోసం చేస్తున్న కృషి, దేశ భద్రత, ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యమని తెలిపారు.