కడప నగరంలో బుధవారం కురిసిన భారీ వర్షం కారణంగా నగరంలోని కాలనీల్లో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. వర్షపు నీరు ఇళ్ల ముందు నిలిచిపోవడంతో వాహనదారులకు, స్కూలు పిల్లలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఈ వర్షం పట్టణ ప్రజలకు తీవ్రమైన వేడి నుంచి ఉపశమనం కలిగించింది.