కడప మేయర్ రేసులో రాయల్ బాబు.. జగన్‌ను కలిసిన అభ్యర్థి

కడప నగరపాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పదవికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం కార్యదర్శి రాయల్ బాబు పోటీ చేయాలని ఆశిస్తున్నారు. బుధవారం తాడేపల్లిలో వైఎస్ జగన్‌ను కలిసిన ఆయన, తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని విన్నవించారు. పార్టీ కోసం ఎంతోకాలంగా నిస్వార్థంగా పనిచేస్తున్నానని, మేయర్ అభ్యర్థిగా అవకాశం కల్పించాలని కోరారు. ఇప్పటికే పలువురు నాయకులు మేయర్ టికెట్ ఆశిస్తున్న నేపథ్యంలో, రాయల్ బాబు రంగంలోకి దిగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕